తెలంగాణ స్టేట్‌కు అరుదైన గౌరవం.. ఏడు అంశాల్లో నాలుగింట తెలంగాణ టాప్
*స్టార్టప్ కంపెనీల స్టేట్ ర్యాంకులను విడుదల చేసిన కేంద్రం
Telangana: తెలంగాణ స్టేట్ అరుదైన గౌరవం అందుకుంది. స్టార్టప్స్ లో స్టార్‌గా నిలిచింది. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో తెలంగాణ టాప్ అంటూ కేంద్రం డిక్లైర్ చేసింది. దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్ పెర్ఫార్మర్స్ రాష్ట్రాల ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో తెలంగాణ టాప్ లో నిలిచింది. స్టార్టప్ కంపెనీల రాష్ట్రాల ర్యాంకులను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇందులో ఏడు అంశాల్లో నాలుగింట తెలంగాణ లీడర్ జాబితాలో చోటు దక్కించుకుంది.
రాష్ట్రాల పనితీరును లెక్కించడానికి కేంద్రం సర్వే చేయించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా స్టార్టప్ మెగాస్టార్స్, సూపర్ స్టార్స్, స్టార్స్, రైజింగ్ స్టార్స్, సనరైజర్స్ పేరుతో అయిదు విభాగాలుగా విభజించారు. అయితే స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి తెలంగాణ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులకు కేంద్రం ఫిదా అయ్యింది.
మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి V-హబ్ పేరుతో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే స్టార్టప్స్‌కు నిధులు సమకూర్చడానికి టీ-ఫండ్ ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వం రూ.15కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు 50కి పైగా స్టార్టప్‌లు రూ.కోటి నిధులను దీని ద్వారా అందుకున్నాయి. స్టార్టప్స్ తో పెట్టుబడిదారులను అనుసంధానం చేయడానికి 15కి పైగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమంలో 800 స్టార్టప్స్, 150 మందికిపైగా భాగస్వాములయ్యారు.