New Ration Cards: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. జారీ చేసేది ఎప్పుడంటే?

New Ration Cards: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Update: 2023-12-12 06:03 GMT

New Ration Cards: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. జారీ చేసేది ఎప్పుడంటే?

New Ration Cards: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తోన్న రేషన్ కార్డులపై కూడా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమీక్ష అనంతరం కొత్త కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తున్నారు.

2014వ సంవత్సరం నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ కాలేదు. అంటే దాదాపుగా 9 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో లక్షల్లో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. అలాగే పాత కార్డుల్లో కొత్త కుటుంబసభ్యుల పేర్లను చేర్చేందుకు కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి.

తెలంగాణలో ప్రస్తుతం 90.14 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటిలో అంత్యోదయ అన్నయోజన పథకం కింద 5.62 లక్షల కార్డులు జారీ చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపుగా 1.25 లక్షల దరఖాస్తులు వచ్చాయంట.

కాగా, కొత్త ప్రభుత్వం అందించే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500లు ఇవ్వాలన్నా.. రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకం అందాలన్నా.. విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా పథకం అందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.

Tags:    

Similar News