Budget 2021: అతిపెద్ద రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశాపెట్టబోతున్న తెలంగాణ సర్కార్‌‌

Budget 2021: ఈ సారి ఏకంగా 2లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

Update: 2021-03-18 02:13 GMT
సీఎం కెసీఆర్ (ఫైల్ ఫోటో)

Budget 2021: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి ఏకంగా 2లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.

వాస్తవానికి కరోనా ప్రభావం, ఆర్థిక మాంద్యంతో 20శాతం బడ్జెట్‌ కుదించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, ఇతర విభాగాల్లో ఆదాయం పుంజుకోవడంతో ఏకంగా 2 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. గత ఆర్థిక సంవత్సరం లక్షా 82వేల కోట్ల పైచిలుకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది ప్రభుత్వం.

ఈ బడ్జెట్లో సంక్షేమ రంగాల విషయంలో ఎలాంటి కోతలు విధించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీ సబ్ ప్లాన్ కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించనున్నారు.

తెలంగాణ బడ్జెట్ అందరికీ ఆదర్శంగా ఉండేలాగా రూపొందించాలని గతంలో సీఎం అధికారులను ఆదేశించారు. దానికనుగుణంగానే వాస్తవ ఆదాయ - వ్యయాలకు తగ్గట్టుగా బడ్జెట్‌ను రూపొందించారు. కరోనా, ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి ఈ బడ్జెట్ ఎలా బయటపెడుతుందో చూడాలి. 

Tags:    

Similar News