Telangana SSC Results: రెండు రోజుల్లో పదో తరగతి ఫలితాలు- మంత్రి సబిత ఆమోదం

Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడోరేపో వెలువడే అవకాశముంది.

Update: 2021-05-20 06:53 GMT

Telangana SSC Results: రెండు రోజుల్లో పదో తరగతి ఫలితాలు- మంత్రి సబిత ఆమోదం

Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడోరేపో వెలువడే అవకాశముంది. ఫలితాల విడుదలకు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. శుక్ర లేదా శనివారాల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కరోనా ఉధృతి కారణంగా వార్షిక పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు విద్యాశాఖ మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి గ్రేడ్లు కేటాయించింది. వీరిలో దాదాపు సగం (2 లక్షల 10 వేల మంది)కిపైగా విద్యార్థులకు ఈ సారి 10 జీపీఏ దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యాశాఖ మార్కుల అప్‌లోడింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నది.

Tags:    

Similar News