Telangana: మంత్రులు వచ్చే వరకూ సచివాలయంలో కానరాని ఉద్యోగులు

Telangana: ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మంత్రులు వచ్చే వరకూ సచివాలయంలో ఉద్యోగులు కానరావడం లేదు.

Update: 2024-07-05 04:55 GMT

Telangana: మంత్రులు వచ్చే వరకూ సచివాలయంలో కానరాని ఉద్యోగులు

Telangana: ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మంత్రులు వచ్చే వరకూ సచివాలయంలో ఉద్యోగులు కానరావడం లేదు. ఉదయం 11 గంటలకు కూడా ఖాళీ కుర్చీలే దర్శనం ఇవ్వడం పట్ల మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల హాజరుశాతం కూడా తక్కువగా ఉంటున్నట్లు మంత్రులు గుర్తించారు. ఏదో ఒకరో ఇద్దరో కాదు మంత్రి పొంగులేటి, జూపల్లి,తుమ్మల,కోమటిరెడ్డి పేషీల్లో ఉద్యోగులు సమయానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. స్వయంగా మంత్రులు సచివాలయానికి వచ్చినా ఉద్యోగులు కనిపించకపోవడం పట్ల మంత్రులు అసంతృప్తు వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు విజిటర్స్‌కు సాయంత్రం మూడు గంటలకు సచివాలయంలోకి అనుమతి ఉంటుంది. అయితే విజిటర్స్ సచివాలయం లోపలికి వచ్చి ఉద్యోగులను కలుద్దామనుకునే లోపే ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. ఉదయం ఆలస్యంగా వస్తూనే సాయంత్రం 4 గంటలకే సచివాలయం ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోతున్నట్లు మంత్రులు గుర్తించారు. విజిటర్స్‌కు కూడా ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదని మంత్రులు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. చర్యలకు ఉపక్రమించకపోకతే ఉద్యోగులు దారికి వచ్చేలా కనిపించడం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఏడాది అటెండెన్స్ వివరాలు ఇవ్వాలని మంత్రలు ఆదేశించారు. సచివాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్న చర్చ జరుగుతోంది.  

Tags:    

Similar News