Telangana: వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ స‌ర్కార్

Telangana: తెలంగాణ స‌ర్కార్ వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్ అందించింది.

Update: 2021-05-27 14:13 GMT

Emblem of Telangana

Telangana: తెలంగాణ స‌ర్కార్ వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్ అందించింది. వాహన‌దారుల కోసం ఎనీవేర్‌ - ఎనీటైమ్ అనే నూత‌న విదానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. కరోనా మహమ్మరి కారణంగా వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయితే వారికి ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఆన్‌లైన్‌ ద్వారా సేవలందించాలని తెలంగాణ‌ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 రకాల సేవలను ఆన్‌లైన్ అందించ‌నుంది. ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీ-యాప్‌ ఫోలియో ద్వారా సేవలు అందించనున్నట్లు తెలిపింది.

టీ-యాప్‌ ఫోలియో యాప్‌ను గూగుల్ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో పేర్కొన్న సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రవాణా శాఖ కమిషనర్‌ తెలిపారు. టీ-యాప్‌ ఫోలియో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకొని తర్వాత మీకు కనిపించే ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే 17 రకాల సేవలు కనపడుతాయి.

డూప్లికేట్‌ పర్మిట్‌, పర్మిట్‌ రెన్యువల్‌, టెంపరరీ పర్మిట్‌ వంటి 17 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. అందులో మనకు అవసరమైన దానిపైన క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్‌ లైసెన్స్‌, ఇష్యూ ఆఫ్‌ బ్యాడ్జ్‌, స్మార్ట్‌కార్డు, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌, డూప్లికేట్‌ లెర్నర్‌ లైసెన్స్‌,పౌరులు తమ స్మార్ట్ మొబైల్ ఫోన్ల నుంచి 17 రకాల సేవలను యాక్సెస్ చేయవచ్చు అని ఈ సేవల కోసం రవాణా లేదా ఆర్టీఏ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు అని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు బుధవారం తెలియజేశారు. 

Tags:    

Similar News