TPCC President: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పీసీసీపై ఉత్కంఠ
TPCC President: రేపు కొత్త పీసీసీ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ * రేపు అన్నిరాష్ట్రాల పీసీసీలతో రాహుల్ గాంధీ సమావేశం
TPCC President: తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎవరు? ఎన్నో నెలలుగా తెలంగాణలో ఉత్కంఠగా సాగుతోన్న ప్రశ్న. దీనిపై ఎట్టకేలకు రెండుమూడు రోజుల్లోక్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఉత్తమ్ రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. పీసీసీ పదవి కోసం ఎంతో మంది సీనియర్లు పోటీ పడ్డారు. ఢిల్లీలోనే మకాం వేసి పెద్ద స్థాయిలో లాబీయింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణకు కొత్త పీసీసీ ఎవరనేదానిపై రేపు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు అన్నిరాష్ట్రాల పీసీసీలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నారు. రేపు సోనియాగాంధీతో కూడా తెలంగాణ ముఖ్యనేతల సమావేశం ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు మకాం వేశారు.
అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ ఎంపికలో ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అయిన తర్వాత అధిష్టానం.. పోటీలో ఉన్న వారిని సముదాయించి, సీనియర్లందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చి, ఈమేరకు కీలక నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.