Telanganaలో ముగిసిన మినీ మున్సిపల్ పోలింగ్..తగ్గిన పోలింగ్ శాతం
Telangana: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు
Telangana: తెలంగాణలో మినీ మున్సిపల్ పోలింగ్ ముగిసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికలపై కొవిడ్ ఎఫెక్ట్ పడింది. గతం కంటే పోలింగ్ శాతం భారీగా తగ్గింది. కరోనా భయం, మధ్యాహ్నం ఎండతో ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. వృద్ధులు కొవిడ్‌కు దూరంగా ఉన్నారు.
సాయంత్రం ఐదు గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. వరంగల్‌లో ఐదు గంటల వరకు 49.25 శాతం నమోదు అయింది. ఖమ్మంలో ఐదు గంటల వరకు 57.91 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఖమ్మం, వరంగల్‌లో చెదురుమదురు ఘటనలు మినహాస్తే పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. అటు ఖమ్మంలో పలు డివిజన్‌లలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.