KTR and Harish Rao holds Review Meeting : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్...

KTR and Harish Rao Review Meeting: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Update: 2020-07-11 08:34 GMT
ktr meeting

KTR and Harish Rao Review Meeting on Municipalities Development: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మున్సిపాలిటీల్లో కొత్తగా సిబ్బంధిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే కేబినెట్ మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న మూడేండ్లలో మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు. ఆ దిశగా నాయకులు, అధికారులు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అంతే కాక హైదరాబాద్ ‌లో మున్సిపాలిటీల అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్షా నిర్వహించారు. సిద్ధిపేట మున్సిపాలిటి అభివృద్ధిలో ప్రత్యేక వ్యూహంతో దూసుకుపోతుందని, ఈ జిల్లా రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5.30 గంటల నుంచి వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణను మొక్కుబడిగా కాకుండా కొత్త ఒరవడితో సేకరించాలని ఆయన తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, తడి, పొడి చెత్త సేకరణ, పన్ను వసూళ్లు ఇలా మొత్తం 42 అంశాల ప్రాతిపదికగా తీసుకుని మున్సిపాలిటీని అభివృద్ధి పరచాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా మొదటి వారంలోనే నెలకు రూ.12వేల చొప్పున వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పాత బస్సులను తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 400 షీ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News