ఎవరైనా బాణసంచా అమ్మితే కేసులు నమోదు చేయండి : హైకోర్టు
దీపావళి బాణసంచాపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా ఉన్నందువలన టపాసులను ఖచ్చితంగా బ్యాన్ చేయాలనీ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది.
దీపావళి బాణసంచాపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా ఉన్నందువలన టపాసులను ఖచ్చితంగా బ్యాన్ చేయాలనీ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా సమయంలో టపాసులు కాల్చితే శ్వాసకోశ సమస్యలు వస్తాయని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు న్యాయవాది ఇంద్రప్రకాష్.. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు బాణసంచా అమ్మకాలు నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అమ్మకాలు జరిపే షాపులను మూసేయాలన్న హైకోర్టు.. ఎవరైనా బాణసంచా అమ్మితే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు నిర్ణయం తీసుకుంది.