ఫాంహౌస్‌ ఎపిసోడ్‌లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

Update: 2022-11-08 11:37 GMT

ఫాంహౌస్‌ ఎపిసోడ్‌లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉన్న స్టేను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేయొచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందన్న న్యాయస్థానం.. మరిన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే అన్ని వివరాలు కోర్టకు సమర్పించిన పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు.

Tags:    

Similar News