చెన్నమనేని పౌరసత్వంపై హై కోర్టులో విచారణ.. హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..

Chennamaneni Ramesh: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది.

Update: 2021-08-10 10:32 GMT

చెన్నమనేని పౌరసత్వంపై హై కోర్టులో విచారణ.. హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..

Chennamaneni Ramesh: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ నేపథ్యంలో బుక్‌లెట్‌ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు పిటీషనర్‌ ఆది శ్రీనివాసరావు తరపు న్యాయవాది రవికిరణ్‌. ఓసీఐ కార్డ్‌పై భారత్‌కు వచ్చి జర్మనీ పాస్‌పోర్టు మీద వెళ్తున్నట్లు చెప్పారు. ఇండియా పాస్ట్‌ పోర్ట్‌ లేకుండా జర్మనీ పాస్‌పోర్టుతో ఇండియా మీదుగా ప్రయాణాలు చేస్తున్నట్లు తెలియజేశాడు. 

అయితే ఓసీఐ కార్డులో జర్మనీ అని నేషనాల్టీ అని ఎలా రాస్తారని న్యాయవాది రవికిరణ్‌ను ప్రశ్నిచింది హైకోర్టు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొంది హైకోర్టు. కాగా, తమ పిటిషనర్ చెన్నమనేనితో సంప్రదించి పూర్తి వాదనలు వినిపిస్తామని చెన్నమనేని తరపు న్యాయవాది తెలపడంతో తదుపరి విచారణను ఆగస్టు 24వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

Tags:    

Similar News