Alert Coronavirus: ఏడాది పాటు కరోనా సోకే అవకాశం..తస్మాత్ జాగ్రత్త

Alert Coronavirus: ప్రతి నిత్యం జాగ్రత్తగా ఉండాలని సీజన్‌ వ్యాధులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

Update: 2021-06-15 04:25 GMT

Telangana Health Department: (Photo: The Hans India)

Alert Coronavirus: సీజన్లతో సంబంధం లేకుండా కరోనా ఏడాది పాటు సోకే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముందస్తుగా పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి నిత్యం జాగ్రత్తగా ఉండాలని సీజన్‌ వ్యాధులకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూలై నుంచి అక్టోబర్‌ మధ్య డెంగీ, మలేరియా, సీజన్‌ జ్వరాలు, అలాగే నవంబర్‌- మార్చి మధ్య స్వైన్‌ ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని, ఏప్రిల్‌ -జూన్‌ మధ్య వడ దెబ్బ, మలేరియా వంటివి వెంటాడుతుంటాయి. కానీ కరోనా మాత్రం ఏడాది పొడవునా పట్టి పీడించే అవకాశం ఉందని పేర్కొంది. సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయాలని, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషించాలని.. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని కోరింది. ఇక సీజనల్‌ అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు 24 గంటలపాటు నడిచే ప్రత్యేక సెల్‌ను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. దీనికి 040–24651119 ఫోన్‌ నెంబర్‌ కేటాయించింది. అంటు వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఈ సెల్‌ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని తెలంగాణ ప్రజా సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు.

అంటువ్యాధుల నుంచి రక్షించుకునేందుకు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించేలా చూసుకోవాలి. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలి. వైద్య సిబ్బంది ఫీవర్‌ సర్వేను కొనసాగించాలని, కరోనాతో పాటు వ్యాధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు.

Tags:    

Similar News