కరోనా పేరుతో ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడిపై ప్రభుత్వం సీరియస్

telangana govt serious on private hospitals: కార్పొరేట్ ఆస్పత్రుల దాహానికి కరోనా రోగులు, వాళ్ళ కుటుంబాలు బలి అవుతున్నాయి. కరోనా ట్రీట్మెంట్ కు ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసినప్పటికీ, ప్రయివేట్ ఆస్పత్రులు మాత్రం ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.

Update: 2020-08-14 04:35 GMT

telangana govt serious on private hospitals: కార్పొరేట్ ఆస్పత్రుల దాహానికి కరోనా రోగులు, వాళ్ళ కుటుంబాలు బలి అవుతున్నాయి. కరోనా ట్రీట్మెంట్ కు ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసినప్పటికీ, ప్రయివేట్ ఆస్పత్రులు మాత్రం ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దాంతో ప్రయివేట్ ఆస్పత్రుల పై ఎపిడమిక్ డీసీజ్ ఆక్ట్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రయివేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు సిద్ధం అయింది. ఇప్పటికే అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ అనుమతి రద్దు చేసింది వైద్య శాఖ. అయినా ప్రయివేట్ ఆస్పత్రుల తీరు మారకపోగా రెచ్చిపోయి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో బాధితులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ ఫిర్యాదులు చేశారు. ఇప్పటికి హైదరాబాద్ లోని అన్ని ఆస్పత్రులపై వెయ్యికి పైగా ఫిర్యాదులు అందాయి. వైద్య అధికారులు, ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే ఎన్నో సార్లు ప్రయివేట్ ఆస్పత్రులను హెచ్చరించారు. కరోనాను కాసుల వ్యాపారంలా చూడొద్దని కోరారు. అయినా మారని ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా రోగులను రకరకాలుగా దోచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బాధితుల నుంచి ప్రభుత్వానికి వివిధ రకాలుగా ఫిర్యాదు అందాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ బిల్లులు వేయడం, మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తే తప్ప హాస్పిటల్స్ లో చేర్చుకోకపోవడం. మరోవైపు బెడ్స్ ఖాళీ లేదని పేషంట్లను కనీసం పరీక్ష చేయకుండానే తిప్పి పంపించడం. ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు అంగీకరించకపోవడం. డబ్బులు చెల్లించినా కూడా రోగులను సరిగా పట్టించుకోకపోవడం, కరోనాతో చనిపోతే డబ్బులు చెల్లించకపోతే డెడ్ బాడీ ఇవ్వకపోవడం లాంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలుమార్లు ప్రయివేట్ ఆస్పత్రులను హెచ్చరించినా, వారి తీరు మారడం లేదు. ఎపిడమిక్ డీసీజ్ యాక్ట్ ప్రకారం ప్రయివేట్ హాస్పిటళ్లకు నియమించిన బెడ్లలో 50 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.

Tags:    

Similar News