శాసన సభ్యులు ఆ హక్కును కోల్పోయినట్లే.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ అసంతృప్తి..

Tamilisai Soundararajan: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించనుండటంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2022-03-05 16:15 GMT

శాసన సభ్యులు ఆ హక్కును కోల్పోయినట్లే.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ అసంతృప్తి..

Tamilisai Soundararajan: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించనుండటంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని కేసీఆర్ సర్కార్ సమర్థించుకోవడాన్ని రాష్ట్ర ప్రథమ మహిళ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

గవర్నర్‌ ప్రసంగం లేకపోయినప్పటికీ బడ్జెట్‌ సమర్పణను స్వాగతిస్తున్నట్లు గవర్నర్‌ కార్యాలయం శనివారం ఓ పత్రిక ప్రకటన విడుడల చేసింది. గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యుల హక్కులకు విఘాతం ఏర్పడుతుంది. గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారు అని ఈ ప్రకటనలో తెలిపారు గవర్నర్‌. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించాలనే ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలించాలన్న సాంప్రదాయం తప్పనిసరి అని గుర్తుచేశారు. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సభ సమావేశమతుందని తెలిపారు. తాజాగా గవర్నర్‌ స్పందన తెలంగాణలో చర్చినీయాంశంగా మారింది.

Tags:    

Similar News