Telangana: ఇళ్లు లేని నిరుపేదలకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.3వేల కోట్లు విడుదల..
Telangana: జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజాపాలనలో భాగంగా.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి టీఎస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి 3వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రజాపాలనలో భాగంగా.. తీసుకున్న అప్లికేషన్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇళ్లను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 38వేల 94 ఇళ్లను కేటాయించింది. అలాగే.. అర్బన్ ప్రాంతాల్లో 57వేల 141 ఇళ్లను కేటాయిస్తూ.. తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.