Telangana: కరోనా సెంకడ్ వేల్ కల్లోలం సృష్టిస్తుంది. మరో వైపు సెంకడ్ వేవ్ పూర్తిగా తగ్గముఖం పట్టక ముందే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్దమైయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేసింది. మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా మూడో వేవ్ తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో నీలోఫర్ ఆసుపత్రిని సీఎస్ సోమేష్‌కుమార్ సందర్శించారు. మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో నీలోఫర్ డాక్టర్లతో సోమేష్‌కుమార్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడో వేవ్‌కు రెడీ అవుతున్నామని తెలిపారు. నీలోఫర్‌లో పరిస్థితి అధ్యయనం చేసి నివేదిక రెడీ చేస్తున్నామని చెప్పారు. నీలోఫర్‌లో వెయ్యి పడకలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం సౌకర్యాలు పెంచుతామని సోమేష్‌కుమార్ తెలిపారు.