Rythu Bharosa: రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా ఎప్పుడంటే..?
Rythu Bharosa: తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
Rythu Bharosa: తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రుణమాఫీ చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో హామీని నెరవేర్చనుందని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోన్న సందర్బంలో రైతులకు శుభ వార్త చెప్పనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 10 వేల ఆర్థిక అందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఈ మొత్తాన్ని రూ. 15వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎలాగైనా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఇప్పటికే కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా.. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి.. డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయితే ఈ పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీలోనూ రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. అలాగే 7 నుంచి 8 ఎరకాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
ఈ పథకం అమలుకు రూ. 7 వేల కోట్లు అవసరమవుతాయని అంచా వేస్తున్నారు. మరి రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండనున్నాయి. రైతుల ఖాతాల్లో డబ్బు ఎప్పుడు జమ కానుందన్న విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.