Corona Third Wave: థర్డ్ వేవ్ తట్టుకునేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళిక
Corona Third Wave: ముందస్తు చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ పొడిగింపు * జూన్‌లోగా కేసులు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగించింది. జూన్‌లోగా కేసులు తగ్గేలా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు గ్రేటర్‌తో పాటు అన్ని జిల్లాలో ఫీవర్ సర్వే కొనసాగిస్తున్నారు. అయితే ఈ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మందికిపై కరోనా లక్షణాలు ఉన్నాట్టు తెలింది. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్ మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 26 లక్షల మందికి లబ్ది చేకురనుంది.