Telangana: ఇవాళ్టి నుంచి నిలిచిపోనున్న ప్రభుత్వ ఆన్‌లైన్‌ సేవలు

Telangana: ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ కూడా పని చేయవని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ వెల్లడించింది.

Update: 2021-07-09 02:45 GMT

తెలంగాణలో ఆన్లైన్ సేవలకు అంతరాయం (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఆన్‌లైన్‌ సేవలు ఇవాళ్టి నుంచి నిలిచిపోనున్నాయి. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ కూడా పని చేయవని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ వెల్లడించింది. 48 గంటల పాటు ఈ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలకు కేంద్ర బిందువైన స్టేట్‌ డేటా సెంటర్‌‌లో కొత్త యూపీఎస్‌ సిస్టంను ఏర్పాటు చేయనున్న దృష్ట్యా వెబ్‌ సైట్లు, ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఐటీ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆధునిక యూపీఎస్‌ ఏర్పాటు కోసం 48 గంటల వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఎస్‌డీసీ ప్రకటించింది.

ప్రస్తుతం గచ్చిబౌలిలోని టీఎస్ఐఐసీ సెంటర్‌లో ఎస్‌డీసీ ఉంది. 2010లో ఏర్పాటు చేసిన ఈ ఎస్‌డీసీ.. 2011 నుంచి సేవలందిస్తోంది. దీనికి అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ అప్లికేషన్లు, సర్వర్లు అనుసంధానమై ఉన్నాయి. ఎస్‌డీసీలో చాలా కాలంగా పాత యూపీఎస్‌ ఉంది. అయితే పవర్‌ బ్యాకప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి తరచూ ఐటీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో దాని స్థానంలో కొత్త యూపీఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఐటీ శాఖ నిర్ణయించింది. దీనిద్వారా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయనుంది.

Full View


Tags:    

Similar News