Telangana: మహిళల రక్షణ కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana: అందుబాటులోకి షీ క్యాబ్స్ పథకం * షీ ట్యాక్సీల కోసం నూతన స్కీం

Update: 2021-02-23 06:35 GMT

Shee Taxi ( photo the hans india)

Hyderabad: గ్రేటర్‌లో షీ క్యాబ్స్ రయ్‌మంటూ పరుగులు పెట్టనున్నాయి. ఇంతకుముందు నగరంలో మహిళలు ఒంటరిగా టాక్సీలు ఎక్కాలి అంటేనే భయపడే వారు.. ఎవరైనా తోడు ఉంటే తప్ప ఎక్కలేనీ పరిస్థితులు పోయాయి. కానీ, ఇప్పుడు ఆ భయాలు తొలగనున్నాయి. ప్రభుత్వం షీ ట్యాక్సీల కోసం నూతన స్కీం తీసుకొచ్చింది. ఇక మహిళలకు ప్రయాణంలో పూర్తి భద్రత అందనుంది. షీ క్యాబ్స్ అందుబాటులోకి వస్తే ఇక అర్ధరాత్రి అయిన వ్యాపార, ఐటీ వర్కింగ్ ఉమెన్స్ షీ క్యాబ్స్ బిందాస్‌గా ఎక్కనున్నారు.

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం షీ ట్యాక్సీల కోసం నూతన స్కీం తీసుకొచ్చింది. ఇక మీద బ్యాంక్‌లు అందించే రుణంతో నగరంలో షీ టాక్సీలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న మహిళలకు 35శాతం సబ్సిడీ కల్పించి వారికి క్యాబ్‌లు పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు వారు 10 శాతం మార్జిన్ మనీ చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్ధులు, ఉద్యోగులు, మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

షీ ట్యాక్సీ పథకం కింద ఉమ్మడి పది జిల్లాల్లో లబ్ధిదారులకు శిక్షణ ఇస్తారు. 30 రోజుల పాటు కొనసాగే శిక్షణ సమయంలో వసతితో కూడిన సదుపాయాన్ని అధికారులు కల్పించనున్నారు. పదో తరగతి పాసై ఉండి 18 ఏళ్లు పై బడిన యువతులు, మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రకటించారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా బిలో పావర్టీ లైన్ కు దిగువన ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసారు.

షీ ట్యాక్సీ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు మహానగరంలో ఉద్యోగ, వ్యాపార పనుల నిమిత్తం బయటకు వచ్చే మహిళల భద్రత కోసం పోలీసులు ఎన్నో రక్షణ చర్యలు చేపడుతున్నారు. అయినా ఎక్కడో ఓ చోట అప్పుడప్పుడు మహిళలపై దాడుల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో శంషాబాద్‌లో జరిగిన దిశ సంఘటన ఇంకా అందరి కండ్ల ముందే కదలాడుతోంది.

మహిళలు యువతులపై జరుగుతున్న దాడుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.. ఇందులో భాగంగానే షీ ట్యాక్స్ పథకాన్ని అందు బాటులోకి తెచ్చింది.. షీ క్యాబ్స్ రావడం పట్ల నగర మహిళలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు

Tags:    

Similar News