Telangana: ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: మ్యూచువల్ బదిలీలు, స్పౌజ్ కేసులు అప్పీల్ పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్

Update: 2022-01-20 00:45 GMT

ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్, స్పౌజ్ కేసులు, అప్పీల్ పరిష్కారానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవో నెంబర్ 317ను సవరించి లోకల్ క్యాడర్ ఉద్యోగుల పరస్పర బదిలీలకు, భార్యాభర్తదల కేసులకు, ఆప్షన్ల ప్రక్రియలో సీనియర్, జూనియర్లకు జరిగిన పొరపాట్లు సవరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉద్యోగుల విభజన, బదిలీలపై టీఎన్జీవో నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయిస్తామని ప్రధానంగా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తామని సీఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యోగుల డీఏ పెంపు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రివర్గ నిర్ణయంతో ఉద్యోగుల డీఏ 10.01 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2021 జూలై 1 నాటికి పెరిగిన డీఏ వర్తింపు అవుతుందని, జనవరి నెల వేతనంతో పాటు ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తింపచేస్తూ ఆదేశాలిచ్చింది. ఇక 2021 జూలై నుంచి బకాయిలు జీపీఎఫ్ లో జమ చేయనున్నట్టు స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. పెరిగిన డీఏతో ప్రతి నెల 260 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా డీఏ మంజూరులో ఆలస్యమైందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. పెడింగ్ డీఏల మంజూరుపై ఉద్యోగ సంఘాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. సీఎం కేసీఆర్ కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News