Telangana White Ration Card: తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలకు ప్రభుత్వం తీపి కబురు
Telangana White Ration Card: వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ
Telangana White Ration Card: తెలంగాణలో తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎదురయ్యే సవాళ్లపై అధికారులతో చర్చించారు మంత్రి ఉత్తమ్. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే పిడియస్ బియ్యం దారి తప్పితే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీలర్లు పట్టుబడితే డీలర్ షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి మచ్చ తెస్తే ఉపేక్షించేది లేదన్నారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపునకు ప్రణాళికలు రచించాలని, ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు మంత్రి ఉత్తమ్.