Metro Rail: ఎయిర్ పోర్టు మెట్రో మార్గానికి కార్యాచరణ ప్రణాళిక.. ఖర్చును భరించనున్న తెలంగాణ ప్రభుత్వం

Metro Rail: 31 కిలో మీటర్లమేర మెట్రో మార్గం

Update: 2023-07-14 02:20 GMT

Metro Rail: ఎయిర్ పోర్టు మెట్రో మార్గానికి కార్యాచరణ ప్రణాళిక.. ఖర్చును భరించనున్న తెలంగాణ ప్రభుత్వం

Metro Rail: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు మార్గం వేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. 31 కిలోమీటర్లమేర మెట్రో మార్గానికయ్యేఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరించే విధంగా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పనులు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణతో ఒప్పంద ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రెండువారాల్లో మెట్రో పనులు ప్రారంభం కాబోతున్నాయి.

శంషాబాద్ విమానాశ్రయందాకా నేరుగా మెట్రోలో ప్రయాణించేలా ప్రభుత్వం ప్రత్యేక ట్రాకింగ్ సిద్ధం చేస్తోంది. మొత్తం 31 కిలోమీటర్ల పరిధిలో 5వేల688 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో కోసం ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ , కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్‌ను వేర్వేరుగా ఎంపిక చేయనున్నారు..ఇప్పటికే 13 కంపెనీలు బిడ్లు వెయ్యగా ఇందులో రెండు కంపెనీలను హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు పరిశీలిస్తున్నారు.

గతంలో హైదరాబాద్ మెట్రో పనులు చేసిన L&T మరియు NCC ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నాయి.. రెండు కంపెనీలు తమ ప్రాజెక్ట్ అమలు అనుభవం, సాంకేతిక, ఆర్థిక బలాలు, ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికలు మొదలైనవాటిని సమర్పించాయి..బ్యాంక్ గ్యారెంటీల రూపంలో ఒక్కొక్కటి రూ. 29 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ చేశారు.. వారి అర్హత ప్రమాణాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక కంపెనీకి ప్రాజెక్ట్ ని ఫైనల్ చేస్తారు.. ఇదివరకు మెట్రో పనులు చేపట్టిన లార్సెన్ అండ్ టూబ్రో సంస్థకే ఎయిర్ పోర్టు మార్గాన్ని పూర్తిచేసే బాధ్యతలు అప్పగించే అవకా‎శాలున్నాయి. 

Tags:    

Similar News