Schools to Reopen in Telangana: పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: టీ సర్కార్
Schools to Reopen in Telangana: రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది.
Schools to Reopen in Telangana: రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంచేసింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ తరగతులు, పాఠశాలల పునఃప్రారంభం, విద్యా సంవత్సరంపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. విద్యా సంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని నివేదికలో పేర్కొంది. కరోనా కారణంగా చాలా రాష్ట్రాలు ఇంకా విద్యా సంవత్సరం ఖరారు చేయలేదని తెలిపింది. అనువైన రోజుల కోసం చూస్తున్నామని చెప్పింది. అలాగే ఆన్‌లైన్ తరగతులపైనా ప్రభుత్వం తమ వైఖరిని కోర్టుకు విన్నవించింది.
అదనపు ఆర్థిక భారంలేని బోధనా పద్ధతులపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది. విద్యా సంవత్సరం, నిరంతర అభ్యసన విధానం ఖరారయ్యాక ఆన్‌లైన్ తరగతులపై మార్గదర్శకాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. స్కూళ్లు తెరిచే వరకు టీవీలు, ఆన్‌లైన్లో పాఠాలు కొనసాగించేలా ముసాయిదా పాలసీ సిద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ విద్యపై విద్యారంగ నిపుణులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. పాఠశాలల ప్రారంభంపై తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ సమర్పించాలని డీఈవోలను ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఆగస్టు 5 వరకు సమయం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరామని వెల్లడించింది.