TS EAMCET: తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. జూన్ 24 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది అప్లై చేసుకున్నారని గోవర్ధన్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఓసారి గడువు పెంచారు. ఇప్పుడు మళ్లీ గడువు పెంచారు. దీంతో మరింత మంది విద్యార్థులు అప్లై చేసుకొనే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ విద్యాశాఖ సెట్ పరీక్షలు నిర్వహించేందుకు నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. జూలై 5 నుండి 9 వరకు జరగాల్సిన మూడు ఎంట్రెన్స్ టెస్ట్‌లను రీషెడ్యూల్ చేసినట్లు విద్యా మండలి చైర్మన్ టీ పాపిరెడ్డి తెలిపారు. మొత్తం ఏడు సెట్స్‌లో 3 సెట్స్ తేదీల్లో మార్పు, మిగిలిన నాలుగు సెట్స్ పరీక్షలు యధాతధంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఆగస్టు చివరి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.