TG DSC EXAMS: నేటి నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు షురూ..అభ్యర్థులు ఇవి తప్పకుండా పాటించాల్సిందే

TG DSC EXAMS:

Update: 2024-07-18 02:54 GMT

TG DSC EXAMS: నేటి నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు షురూ..అభ్యర్థులు ఇవి తప్పకుండా పాటించాల్సిందే

TG DSC EXAMS:మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. డీఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనకు ప్రభుత్వం తలగొగ్గకుండానే డీఎస్సీ నిర్వహిస్తుంది. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామంటూ ప్రకటించి అభ్యర్థులకు మరిన్ని ఆశలు రేకెత్తించింది. కాగా సర్కార్ నేటి నుంచి డీఎస్సీ పరీక్షలను నిర్వహించనుంది. రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఆన్ లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు ఒక సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30గంటల వరకు మరో సెషన్ పరీక్ష ఉంటుంది.

అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి మాత్రం మరో అరగంట అదనంగా పరీక్ష జరుగుతుందని విద్యాశాఖ తెలిపింది. ఉదయం 7.30 నుంచే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు. పరీక్షకు 10 నిమిషాల ముందే అభ్యర్థులు తప్పనిసరిగా సెంటర్లోకి వెళ్లాల్సి ఉంటుందని ఆలస్యం అయితే అనుమతించమని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల్లో క్యాలిక్ లేటర్లు, లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ ఫోన్స్, వాచ్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది లేదని పేర్కొంది. అభ్యర్థులు హాల్ టిక్కెట్ తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో బీఆర్ ఎస్ సర్కార్ సుమారు 5వేలకుపైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పలు కారణాలతో పోస్టులు భర్తీ చేయలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైనాన్స్ విభాగం ఆమోదించిన 5,976 పోస్టులకు పాత వాటిని జతచేసి మొత్తం 11,056 పోస్టులతో ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.దీనిలో 2,629 స్కూల్ అసిస్టెంట్ , 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటరిగిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. కాగా డీఎస్సీ రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 79వేల 956 మంది దరఖాస్తు చేసుకున్నారని.. నిన్న సాయంత్రం వరకు సుమారు 2 లక్షలన్నర మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకే రోజు రెండు పరీక్షలు రాయాల్సి ఉన్న వారు ఒకే కేంద్రంలో పరీక్ష రాసే విధంగా వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. 

Tags:    

Similar News