ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి : సీఎస్ సోమేశ్ కుమార్
లాక్ డౌన్ కారణంగా నిలిచిన దేశీయ విమాన సర్వీసులు సుమారు రెండు నెలల తరువాత శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమయ్యాయి.
లాక్ డౌన్ కారణంగా నిలిచిన దేశీయ విమాన సర్వీసులు సుమారు రెండు నెలల తరువాత శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల ప్రకారం దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విమానాశ్రయంలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. అనతంరం ఆయన మట్లాడుతూ ప్రయాణికుల ఆరోగ్యంపై అధికారులందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. విమానంలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుని ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ తప్పని సరిగా ఉండాలని సూచించారు. ఆ యాప్ ఉంటేనే ప్రయానికులను లోపలికి అనుమతిస్తున్నాం అని తెలిపారు. ప్రయాణికుల్ని టచ్ చేయకుండా సెన్సార్‌లు కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ప్రయాణికుడు ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ప్రభుత్వం సూచనలు పాటించాలని తెలిపారు. ఎయిర్ పోర్టులో ప్రతి అంశంపైన అదికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.
ఈ రోజు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి19 విమానాలు ఇతర రాష్ట్రాలకు వెళతాయని, మరో 19 విమానాలు 19 హైదరాబాద్ కు వస్తాయని ఆయన అన్నారు. రేపటి నుంచి మరికొన్ని విమానాలను పునరుద్దరిస్తామని ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షల పూర్తయ్యాకే అనుమతిస్తున్నామిన ఆయన తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే ఆస్పత్రికి పంపిస్తామని, లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్ ఉండదని ఆయన వెల్లడించారు. ఇక ఈ రోజు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కి 1600 మంది వస్తున్నారని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.