KCR: కేంద్రంతో చి'వరి'గా తేల్చుకుంటాం.. నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

*కేసీఆర్‌తో పాటు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రులు, ఎంపీలు *ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో సంప్రదింపులు జరుపనున్న కేసీఆర్‌

Update: 2021-11-21 03:40 GMT

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌(ఫోటో: ది హన్స్ ఇండియా)

KCR: నేడు సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన వెంటే మంత్రులు, ఎంపీలు కూడా హస్తినకు బయల్దేరనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ బాట పట్టారు. అదేవిధంగా రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధాని మోడీని కేసీఆర్‌ కోరనున్నట్లు తెలుస్తోంది.

అన్ని రాష్ట్రాల నుంచి సేకరించినట్లే తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ లక్ష్యం ఎంతో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడంలేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆలస్యమైతే రైతుల్లో అయోమయం నెలకొంటుందని చివరి ప్రయత్నంగా ఇవాళ మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందంతో తాను ఢిల్లీకి వెళ్తున్నానని తెలిపారు కేసీఆర్. కేంద్ర వ్యవసాయ మంత్రిని, ప్రధాని మోడీని కలుస్తామని తాను రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనేది లేదని చెప్పినట్లు గాలి వార్త వచ్చిందని.. అది అధికారికమా అనే విషయమూ తేల్చుకుంటామన్నారు.

Full View


Tags:    

Similar News