Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ
Cabinet Meeting: మ.2 గంటలకు సమావేశం కానున్న మంత్రివర్గం * ఉద్యోగాల భర్తీ కీలక ఎజెండాగా కేబినెట్ భేటీ
Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఆదాయ మార్గాలతో పాటు వివిధ అంశాలు చర్చకు రానున్నాయి.
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రాగా ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు ఇవాళ కేబినెట్ కూడా ఆమోదం తెలపనుంది. 32 శాఖల్లో 45 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. అటు పదోన్నతులపై కూడా నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ఇక ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించిన ఆర్థికశాఖ ఇవాళ కేబినెట్ ముందు నివేదిక ఉంచనుంది పోలీస్‌శాఖలోనే 21 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనుండగా మిగిలిన పోస్టులను వివిధ శాఖల్లో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
గత కేబినెట్ సమావేశంలో ఆదాయ మార్గాలపై దృషి పెట్టిన సర్కార్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ భూముల రిజిస్ట్రేషన్, స్టాంప్స్ డ్యూటీ లను పెంచడంపై నిర్ణయం తీసుకోగా దీనికి సంబంధించిన నివేదిక కూడా కేబినెట్ ముందు ఉంచనున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కరోనా కంట్రోల్ కావడం లేదన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనుంది వైద్యశాఖ. పంటలు, ఎరువుల కొరత,జులై 1 నుంచి 10 వరకు చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులపై అధికారుల నుండి సీఎం వివరాలు అడిగి తెలుసుకొనున్నారు. నూతన రేషన్ కార్డుల జారీ విదానంపై సీఎం ఈ సమావేశంలో ఆరా తీసే అవకాశం ఉంది.