TS Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్
TS Cabinet: ఆరు గంటల పాటు సాగిన కేబినెట్
TS Cabinet: తెలంగాణ కేబినెట్ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆరు గంటల పాటు సాగిన ఈ భేటీలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 24 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే హైదరాబాద్‌లో నాలుగు సూర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఓకే చెప్పింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్యా కాలేజీల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గౌడ కులస్ధులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం కేటాయించింది. మరోవైపు ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కార మార్గాల కోసం మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు.
మరోవైపు వర్షాపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగయిన భూమి వివరాలు.. పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపై కేబినెట్ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలు పై అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై కేబినెట్‌లో చర్చించారు.