Telangana: హద్దురాళ్లు ఊడిపోయినా భూమికి రక్షణ

Telangana: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రగతి భవన్ లో జరిగింది.

Update: 2021-06-09 04:09 GMT

కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Telangana: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రగతి భవన్ లో జరిగింది. సుమారు తొమ్మది గంటల పాటు సుధీర్ఘంగా సాగిన సమావేశంలో పలు అంశాలను చర్చించిన కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) ను నిర్ధారించాలని, అందుకు సంబంధించి పాత ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.

వ్యవసాయ భూముల సెటిల్ మెంట్ అనే వ్యవహారమే ఉత్పన్నం కాదని, ఇది ఇప్పటికే సమస్యలేవీ లేకుండా పరిష్కారమై ప్రక్రియఅని, రాష్ట్ర ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోర్ చట్టం- 2020 ప్రకారం, రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే ధరణిలో నమోదయినాయని కేబినెట్ కు రెవిన్యూ శాఖ వివరించింది. రైతుల కాస్తులో ఉన్న భూములకు, భౌతికంగా వుండే హద్దురాల్లు, కాయితాలమీద వుండే టీఫన్ కక్షతో కూడిన కొలతలు ఇకనుంచి అదే లెక్కలతో అవే హద్దులు డిజిటల్ రూపంలోకి మారుతాయని, రాల్లు ఊడిపోయినా, కొలతల కాగితాలు చినిగిపోయినా రైతుల పట్టా భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్ మ్యాప్ ద్వారా రక్షణ లభిస్తుంది.

Tags:    

Similar News