Telangana: ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు?

Telangana: బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోన్న సర్కార్

Update: 2024-01-29 03:45 GMT

Telangana: ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు?

Telangana: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో.. కేంద్ర ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడమా లేదా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టాలా అనేది ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే దీనికోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెడితే సమావేశాలు నాలుగైదు రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అవ్వొచ్చనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆలోపే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం‎, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆ దిశగా అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News