BJP: నేటి నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు
* శిక్షణ తరగతులు ప్రారంభించనున్నతరుణ్‌చుగ్.. పార్టీ సిద్ధాంతాలపై అవగాహన కల్పించడం.. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చ
Training Classes For BJP: బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలోని శామీర్‌పేటలో నిర్వహించనున్నారు. శిక్షణతరగతులకు పార్టీ నేతలు హాజరుకానున్నారు. శిక్షణ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలపై నాయకులకు అవగాహన కల్పించనున్నారు. దేశంలోని తాజా రాజకీయాలు, సమకాలీన అంశాలపై చర్చించనున్నారు. ఇందులో తెలంగాణలోని అంశాలు కూడా చర్చకు రానున్నాయి. చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ విషయంలో అనుసరించే కార్యాచరణపై చర్చించి.. రాజకీయ తీర్మానం చేయనున్నారు.