ఈనెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly: ఈనెల 23 నుంచి తెలంగాణ శాసనసభ..24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి.
Telangana Assembly: ఈనెల 23 నుంచి తెలంగాణ శాసనసభ..24 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సెషన్స్‌లోనే.. రైతుభరోసా, R&R చట్టం రద్దు, తెలంగాణ లోగో మార్పు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, పలు బిల్లులపై ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏయే శాఖలకు కేటాయింపులు ఎలా జరపాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు అధికారులు.