Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? వస్తే చరిత్రే

Telangana Assembly: నేటి తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా కేసీఆర్ అసెంబ్లీహాజరకాబోతున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలకు ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది.

Update: 2024-07-23 01:27 GMT

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? వస్తే చరిత్రే

Telangana Assembly:నేటి తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా కేసీఆర్ అసెంబ్లీహాజరకాబోతున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలకు ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. జులై 25 ను బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం, డిప్యూటీ సీఎం. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే అసెంబ్లీకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా నేడు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు షురూ అవ్వగానే దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సభ్యులు సంతాపం తెలియజేస్తారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ కు ప్రతిపక్షపాత్రకు పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ కాలుకు తుంటి ఎముకకు చికిత్స జరిగింది. వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలు రాలేదు. కేటీఆర్, హరీశ్ రావులే సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తగు సమాధానం చెప్పారు. అయితే ఈ సారి మాత్రం జరిగే సమావేశాలకు చాలా మంది కాంగ్రెస్ వైపు మళ్లారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే బలం కూడా చాలా తగ్గుతోంది. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెబుతున్న నేపథ్యంలో అన్నీతానే పార్టీకి పూర్తవైభవం తీసుకువస్తానని కేసీఆర్ అంటున్నట్లు శ్రేణులు చెబుతున్నారు. మరి కేసీఆర్ రాకతో అసెంబ్లీ సమావేశాలు ఎలా సాగుతాయన్న ఉత్కంఠ నెలకొంది.

ఇక దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో బడ్జెట్ తోపాటు రుణమాఫీ, ధరణి, రైతు భరోసా, ఉద్యోగాలు, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నం వంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News