బీఆర్ఎస్ ప్రచార హోరు.. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత సుడిగాలి పర్యటన
BRS: గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న కీలక లీడర్లు
BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాల స్పీడ్ పెంచాయి. అధికార పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలతో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు బలంగా చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. కవిత నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాల జోరు పెంచారు.
రెండు జాతీయ పార్టీలే టార్గెట్‌గా ఇటు కేసీఆర్, అటు కేటీఆర్, మంత్రి హరీష్ రావు ముప్పేట విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కరెంట్, ధరణి, రైతుబంధు అంశాలపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీఆర్ఎస్ అగ్ర నాయకులు తిప్పికొడుతున్నారు. రెండో విడుత ప్రచారాల్లో కేసీఆర్ విమర్శల డోసు పెంచినట్టు తెలుస్తుంది. ఇక కేటీఆర్, మంత్రి హరీష్ రావు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే.. రాబోయే కాలంలో ప్రవేశ పెట్టే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే చేపట్టబోయే నాలుగు కొత్త పథకాలను వివరిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.