బోనమెత్తిన భాగ్యనగరం.. అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు

*ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తలసాని *తెలంగాణ ఏర్పడ్డాక బోనాలను రాష్ట్రపండుగగా కేసీఆర్‌ ప్రకటించారు

Update: 2021-08-01 05:51 GMT

ఘనంగా లాల్‌ దర్వాజ బోనాలు (ఫైల్ ఫోటో)

Bonalu Festival: భాగ్యనగరంలో అట్టహాసంగా బోనాల జాతర జరుగుతోంది. లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులంతా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. తెలంగాణ ఏర్పడ్డాక బోనాలను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి తలసాని.

Tags:    

Similar News