Tadla Rampur Society: పక్కదారి పట్టిన రైతుల సొమ్ము.. లబోదిబోమంటున్న బాధిత రైతులు

Tadla Rampur Society: అధికారులు, పాలకవర్గ సభ్యులు చేతులు కలిపారు.

Update: 2021-07-01 08:26 GMT

పక్కదారి పట్టిన రైతుల సొమ్ము.. లబోదిబోమంటున్న బాధిత రైతులు

Tadla Rampur Society: అధికారులు, పాలకవర్గ సభ్యులు చేతులు కలిపారు. రైతుల సొమ్మును వాళ్లకు తెలియకుండా పక్కదారి పట్టించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర స్దాయిలో హాట్ టాఫిక్‌గా మారింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఇలాకాలో రైతుల సొమ్ము పక్కదారి పట్టడం రాజకీయంగా చిచ్చు రేపుతోంది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సొసైటీ అక్రమాలు, నిధులు దారి మళ్లింపు వ్యవహారం, రైతుల ఇబ్బందులపై హెచ్ఎం టీవీ గ్రౌండ్ రిపోర్ట్.

మూడు దశాబ్దాల చరిత్ర 3 వేల మంది రైతుల సభ్యత్వం కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఓ వెలుగు వెలిగిన తాళ్ల రాంపూర్ సహకార సొసైటీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. గత పాలకవర్గం అడ్డగోలు నిర్ణయాలతో రైతులు దాచుకున్న సొమ్ము పక్కదారి పట్టింది. బాండ్ల రూపంలో కోట్ల రూపాయల చెల్లింపులు చేయాల్సిన అధికారులు రైతులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఫలితంగా రైతులు డిపాజిట్ చేసిన డబ్బుల కోసం రోడ్డెక్కారు.

డిపాజిట్ సొమ్ము సకాలంలో అందక కొందరు రైతులు తమ ఆడబిడ్డల పెళ్లిళ్లను వాయిదా వేయగా.. మరికొందరు అప్పు చేసి పెళ్లి చేశారు. ఇప్పుడు అప్పు తీర్చ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లరాంపూర్ సొసైటీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ఉండటంతో రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టాయి. తాజాగా రైతుల ధర్నాలో ఎంపీ అర్వింద్ భైఠాయించి మద్దతును తెలిపారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని, పూర్తిస్దాయి విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Full View


Tags:    

Similar News