స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ

*ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Update: 2022-10-02 02:19 GMT

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ

Delhi: స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించగా.. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఆయా అవార్డులను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయా పట్టణాల చైర్మన్లు, చైర్‌పర్సన్స్‌ అందుకున్నారు. తెలంగాణ నుంచి కోరుట్ల మున్సిపాలిటీకి లభించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును కేంద్ర మంత్రి కౌషల్‌ కిశోర్‌ నుంచి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య, కమిషనర్‌ అయాజ్‌ అందుకున్నారు. తెలంగాణకు అవార్డులు దక్కడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. అర్బన్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం 16 అవార్డులతో రెండోస్థానంలో నిలిచిందని, మార్గనిర్దేశనం చేస్తూ, పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Full View
Tags:    

Similar News