రేపటి బీజేపీ నిరుద్యోగ దీక్షపై సస్పెన్స్‌.. అనుమతి ఇవ్వలేమన్న పోలీసులు

BJP Nirudyoga Deeksha: నిరుద్యోగ దీక్షకు పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు...

Update: 2021-12-26 05:34 GMT

రేపటి బీజేపీ నిరుద్యోగ దీక్షపై సస్పెన్స్‌.. అనుమతి ఇవ్వలేమన్న పోలీసులు

BJP Nirudyoga Deeksha: రేపటి బీజేపీ నిరుద్యోగ దీక్షపై సస్పెన్స్‌ నెలకొంది. హైకోర్టు ఆదేశాల దృష్ట్యా తెలంగాణలో జనవరి రెండు వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో.. నిరుద్యోగ దీక్షకు పోలీసుల అనుమతి కోరుతూ తెలంగాణ బీజేపీ నేతలు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే.. బీజేపీ దీక్షకు అనుమతివ్వలేమని పోలీసులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు.. ఇందిరాపార్కు దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష చేసి తీరుతామని బీజేపీ నేతలు అంటున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగానే దీక్ష చేస్తామని, ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే వరకు కేసీఆర్‌ సర్కార్‌ను వదిలే ప్రసక్తేలేదని చెబుతున్నారు టీబీజేపీ నేతలు.

తెలంగాణలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. ఈ సమస్యపై పోరాటం చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించుకుంది. ‌నీళ్లు, నిధులు, నియామకాల కోసం యువత ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేశారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. నిరుద్యోగ సమస్య తీరలేదనేది కమళనాధులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.

నిరుద్యోగుల అంశంపై పెద్దఎత్తున పోరాటానికి టీబీజేపీ సిద్ధమవుతోంది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఇందిరాపార్క్ వద్ద సోమవారం తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ దీక్షకు దిగనున్నారు. అలాగే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపాలని పిలుపునిచ్చారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News