Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ నిర్ణయంపై ఉత్కంఠ.. రద్దు చేయాలా లేక..

TSPSCలో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Update: 2023-03-14 09:25 GMT

Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ నిర్ణయంపై ఉత్కంఠ.. రద్దు చేయాలా లేక..

TSPSCలో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే లీకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రవీణ్‌ 2017లో TSPSCలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్‌ విభాగంలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్‌ విభాగానికి వచ్చే మహిళల ఫోన్ నంబర్లను నిందితుడు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్‌ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. AE పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్‌ అయిందని పోలీసులు తేల్చారు.

పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి, ఈనెల 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలకు సంబంధించిన పేపర్‌ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుంది. నిందితుడు ప్రవీణ్‌ నుంచి పేపర్‌ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టు సమాచారమున్న మరో నలుగురు అభ్యర్థులనూ విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు.

ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు టీఎస్‌పీఎస్సీ సమావేశం కానుంది. సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్ అధ్యక్షతన భేటీకానున్నారు. పరీక్ష పేపర్ లీకేజీపై చర్చించనున్నారు. రద్దు చేయాలా లేక లీక్‌ పేపర్ అందిన వారిని తొలగించి.. ముందుకు వెళ్లాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బాధ్యులైన ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News