Excise Policy Case: నేడు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ

Excise Policy Case: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.

Update: 2024-08-27 03:39 GMT

Excise Policy Case: నేడు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ

Excise Policy Case: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టుల్లో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్ వేశారు.

గత విచారణలో కవిత బెయిల్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసుడైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యం అయిందని నిలదీసింది సుప్రీంకోర్టు. కవిత కేసులో తాజాగా ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడంతో ఇరుపక్షాల వాదనలను నేడు సుప్రీంకోర్టు విననుంది.

Tags:    

Similar News