Telangana High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు.. స్టే కు నిరాకరించిన హైకోర్టు

Telangana High Court: ఎమ్మెల్యేల అనర్హతపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం నిరాకరించింది.

Update: 2024-10-03 06:30 GMT

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు.. స్టే కు నిరాకరించిన హైకోర్టు

Telangana High Court: ఎమ్మెల్యేల అనర్హతపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం నిరాకరించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై చర్యలను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు సింగిల్ బెంచ్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే ఈ అంశంపై సుమోటోగా తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.

ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని డివిజన్ బెంచ్ ను కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం నిరాకరించింది. ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది హైకోర్టు.

Tags:    

Similar News