అనారోగ్య కారణాలతో విచారణకు రావడం లేదని సీసీఎస్ పోలీసులకు సునీల్ లేఖ
Cybercrime ACP: సునీల్ కనుగోలు నుంచి మాకు ఎలాంటి లేఖ అందలేదు
Sunil Kanugolu: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సీసీఎస్ విచారణకు టీకాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకావడం లేదని సీసీఎస్ పోలీసులకు సునీల్ లేఖ రాసినట్టు సమాచారం. అయితే సునీల్ కనుగోలు గైర్హాజరుపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు సీసీఎస్ పోలీసులు. సునీల్ కనుగోలు నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదన్నారు. సునీల్ కనుగోలుకు నోటీసులిచ్చామని, విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. విచారణకు వస్తానని మాకు సమాచారం ఇచ్చారని, సునీల్ కనుగోలు వస్తే విచారించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీసీఎస్ పోలీసులు.