సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలనం.. కవితతో జరిపిన చాట్ ఇదే అంటూ స్క్రీన్ షాట్స్ విడుదల
Sukesh Chandrasekhar: తన వాట్సాప్ చాట్‌ను బయటపెట్టిన సుఖేష్
Sukesh Chandrasekhar: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల చేశాడు. అయితే ఈ సారి లేఖతో పాటు తన వాట్సాప్ చాట్‌ను సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా బయటపెట్టడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేతలతో చేసిన చాటింగ్‌ను సుఖేష్ తాజాగా బయటపెట్టడం కలకలం రేపింది. కవితతో చాట్‌ను సుఖేష్ బయటపెట్టాడు. కవితక్క - టీఆర్ఎస్ అనే నంబర్‌తో సుఖేష్ చాట్ చేసినట్లు తెలిపాడు. అయితే మొత్తం 6 పేజీల లేఖను సుఖేష్ విడుదల చేయగా తాజా లేఖ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.