క్రీడా పాలసీ కోసం సబ్‌ కమిటీ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Update: 2020-08-29 08:20 GMT

Srinivas Goud : రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాపాలసీ కోసం క్యాబినెట్‌ సబ్ ‌కమిటీ వేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం హాకీ స్టేడియంలో నిర్వహించగా.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వాక్యాలు వ్యాఖ్యలు యధావిధిగా.. క్రీడాకారులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ధ్యాన్ చంద్ మామూలు స్ధాయి నుంచి ఒలింపిక్స్ లో బంగారు పథకాలు సాధించాడు. సామాన్యుడు పట్టుదలతో ఆడితే ఏదైనా సాధిస్తాడు అనడానికి ఉదాహరణ ధ్యాన్ చంద్.

ధ్యాన్ చంద్ చరిత్ర ప్రతి క్రీడాకారుడు తెలుసుకునేందుకు ఆయన పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయామం అవసరం. తెలంగాణలో క్రీడలకు పెద్దపీఠ వేశామ్. రాష్ట్రంలో ఇప్పటికే 45 స్టేడియంలను పూర్తి చేసాం, మరో 50స్టేడియంలు నిర్మించాలని నిర్ణయించాం. ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్ కల్పించాం. క్రీడాపాలసీ కోసం ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. దేశంలో లేని క్రీడా పాలసీని తీసుకువస్తాం. ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్ లో పతకాలు సాధిస్తే దేశానికి గొప్ప పేరు వస్తుంది. ప్రతి వ్యక్తి ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకోవాలి అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.








Tags:    

Similar News