BASARA IIIT PROTEST: విద్యార్ధులకు తాగునీరు బంద్.. విద్యార్థులపై అధికారుల కక్ష సాధింపు చర్యలు..?
BASARA IIIT PROTEST: బాసర ట్రిపుల్ ఐటీ లో ఆందోళన చేపట్టినవారిపై యూనివర్శిటీ అధికారులు కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
BASARA IIIT PROTEST: బాసర ట్రిపుల్ ఐటీ లో ఆందోళన చేపట్టినవారిపై యూనివర్శిటీ అధికారులు కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు అందించడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించిన వారికి తాగునీరు అందకుండా చేస్తున్నారని.. విద్యుత్ సౌకర్యాన్ని నిలిపేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు కావాలనే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగారని అంటున్నారు.
తమ సహనాన్ని పరీక్షించవద్దని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. శాంతియుత పోరాటం చేస్తుంటే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీ వాంట్ వాటర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కవరేజ్ కు వెళ్లిన మీడియాను యూనివర్శిటీ గేట్ దగ్గరే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.