ఆందోళన విరమించిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
Basara IIIT: అర్థరాత్రి క్యాంపస్‌లో వీసీ వెంకటరమణతో విద్యార్థుల చర్చలు
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనను విరమించారు. అర్ధరాత్రి క్యాంపస్‌లో వీసీ వెంకటరమణతో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మెస్ టెండర్ల రద్దు ఇప్పట్లో సాధ్యంకాదని వీసీ వెంకటరమణ తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి హాస్టల్‌కు వెళ్లిపోయారు విద్యార్థులు. ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు. ఎస్‌జీసీ విద్యార్థుల కమిటీతో చర్చల తర్వాత. తమ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు విద్యార్థులు. అయితే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్ హామీ ఇచ్చారు. నేటి నుంచి యధావిధిగా విద్యార్థులు క్లాస్‌లకు వెళ్తారని తెలిపారు డైరెక్టర్ సతీష్.