ఓయూలో విద్యార్ధుల ఆందోళన.. సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాలు తర్వాతే.. పరీక్ష పెట్టాలంటున్న విద్యార్ధులు
OU: సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థుల ఆగ్రహం
OU: ఓయూలో పీజీ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. UGC రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిరసన చేపట్టారు. సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాలు తర్వాతే పరీక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలలు కూడా పాఠాలు చేప్పలేదని అంటున్నారు. వీసీకి వారం రోజుల క్రితమే వినతి పత్రం ఇచ్చినా సమాధానం లేదని విద్యార్దులు వాపోయారు. దీంతో ఇంటర్నల్ పరీక్షలను విద్యార్ధులు బాయ్ కాట్ చేశారు.